si

ఎస్సై కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

May 18, 2023

ఎస్సై కొట్టాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం నేను కొట్టలేదు: ఎస్సై ఎస్సై కొట్టాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కామేపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన అంగిడి దుర్గాప్రసాద్‌ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని, గర్భవతిని చేశాడంటూ అతనిపై అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత మంగళవారం సాయంత్రం కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దుర్గాప్రసాద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ […]

Read More

కారు, లారీ ఢీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి

May 11, 2023

కారు, లారీ ఢీ.. హెడ్ కానిస్టేబుల్ మృతిచౌటకూర్ : కారు, లారీ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన చౌటకూర్ మండలం పరిధిలోని సరాఫ్ పల్లి గ్రామ శివారులో పీ.పీ.ఆర్ గార్డెన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల షాపూర్ నగర్ కు చెందిన అరవిళ్ల నరసింహారావు (55) సైబరాబాద్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, తన అల్లుడు కోనేటి […]

Read More

పరువు హత్య.. తల, మొండెం వేరుచేసిన వైనం

February 25, 2023

పరువు హత్య.. తల, మొండెం వేరుచేసిన వైనం కాపురానికి వెళ్లని కన్న కూతురును కడతేర్చిన తండ్రి పాణ్యం గ్రామీణం : కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన సంఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాణ్యం ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె ప్రసన్న(21) కు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుతో వివాహం జరిపించారు. […]

Read More

బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారయత్నం

December 30, 2022

బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారయత్నంపోక్సో కేసు నమోదు అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై గ్రామవాలంటీరు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో గురువారం వెలుగుచూసింది. రాళ్లబూదుగూరు ఎస్సై డి.మునిస్వామి కథనం ప్రకారం.. అబకలదొడ్డి పంచాయతీ వెంకటేశపురానికి చెందిన శివయ్య అక్కడ గ్రామ వాలంటీరు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా రోదిస్తూ విషయం తెలిపింది.బాలిక […]

Read More

పోలీసులతో యువకుడి వాగ్వాదం.. చెప్పు చూపెట్టిన ఎస్సై..

December 28, 2022

పోలీసులతో యువకుడి వాగ్వాదం.. చెప్పు చూపెట్టిన ఎస్సై.. వీడియో వైరల్​వైఎస్సార్​ జిల్లాలో.. నంద్యాల జిల్లాకు చెందిన పోలీస్ అధికారుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాహనం నిలిపే విషయంలో యువకుడితో ఘర్షణకు దిగిన ఎస్సై చేతిలో చెప్పు ఉన్న సీసీ ఫుటేజీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్​ జిల్లా జమ్మలమడుగు పరిధిలోని దేవగుడి గ్రామానికి చెందిన వెంకటయ్య అనే యువకుడికి, నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో వాగ్వాదం […]

Read More

డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు..

December 27, 2022

డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..ఆమె ఒక మహిళా ఎస్సై. నలుగురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. కానీ, కామంతో కళ్లుమూసుకుపోయి ఓ క్షమించరాని నేరం చేసింది. డ్రైవర్‌తో తన రాసలీలలు సాగించేందుకు.. అడ్డుగా ఉన్నాడని భర్తని అంతమొందించింది. ఇందుకు ఓ జ్యోతిష్యురాలి సహకారం తీసుకుంది. మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. తల్లి చేసిన నేరానికి కొడుకు కూడా మద్దతు తెలపడం. ఆమె చెప్పినట్టుగానే తలూపుకుంటూ పోయాడు. చివరికి పోలీసులు ఈ కేసుని ఛేధించడంతో, […]

Read More

దేశం మొత్తం తెలంగాణ ‘లాంగ్ జంప్’ గురించే

December 16, 2022

SI, Constable Events: తెలంగాణలో జరుగుతున్న పోలీసు నియామకాల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ముందు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కుల విషయంలో నెలకొన్న వివాదం.. ఆ తర్వాత సర్కారు దిగిరావటంతో సద్ధుమణిగింది. కాగా.. ఇప్పుడు ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయంలో కొత్త వివాదం చెలరేగింది. SI, Constable Events: తెలంగాణ సర్కార్ చేపట్టిన పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియను ముందు నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ప్రిలిమినరీ పరీక్ష విషయంలో అర్హతకు సంబంధించిన కటాఫ్ మార్కుల […]

Read More

సీఐ బూతులు తిట్టాడని పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల ఆందోళన

December 15, 2022

సీఐ బూతులు తిట్టాడని పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల ఆందోళనగ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను సీఐ బూతులు తిట్టిండని జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి మండలం మెట్లచిట్టపూర్ గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​లో ఆందోళన చేశారు. వీడీసీ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణపై వీడీసీ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఎనిమిది సంఘాలు ఓ వైపు, రెండు సంఘాలు మరో వర్గంగా ఏర్పడ్డాయి. తమను గ్రామ బహిష్కరించారని రెండు కుల సంఘాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు […]

Read More

తన ఇంటికి కాకుండా పక్క ఇంటికి వెళ్లిన ఎస్సై..

December 1, 2022

తాగిన మత్తులో తన ఇంటికి కాకుండా పక్క ఇంటికి వెళ్లిన ఎస్సై.. పోలీసును చితకబాది చెట్టుకు కట్టేసిన జనంమత్తులో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సొంత ఇంటికి బదులు మరో ఇంటి తలుపు తట్టి లోనికి వెళ్లాడు. అతను ఎవరో తెలియని స్థానికులు చితకబాది చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన జడ్చర్ల పరిధిలోని రాజాపూర్ మండలంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. […]

Read More

SI కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్

November 27, 2022

BIG BREAKING: డిసెంబర్ 8 నుంచి ఎస్సె, కానిస్టేబుల్ ఈవెంట్స్ తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు.. ఈవెంట్స్త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో నిరుద్యోగులు ఈవెంట్స్ పై కసరత్తు ప్రారంభించారు. తాజాగా ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీలను ఖరారు చేశారు. డిసెంబర్ 8 నుంచి జనవరి 03, 2023 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?