గ్రామసభలో సర్పంచిపై దాడి గ్రామసభలో సర్పంచిపై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్ మండలం మొట్లతండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామసభ జరిగింది. ఉపసర్పంచితో పాటు వార్డు సభ్యులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సభ వాయిదా వేయాలని సర్పంచి సుమన్ అనడంతో గ్రామానికి చెందిన యువకుడు వర్రె మహేష్ గ్రామంలో అభివృద్ధి జరగటం లేదని, పనులు చేయకుండానే నిధులు కాజేశారని ఆరోపిస్తూ సర్పంచితో వాగ్వాదానికి దిగారు. ఈ […]
Read Moreవడదెబ్బతో విద్యార్థిని మృతి వడదెబ్బ సోకి చికిత్స పొందుతూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు-నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ […]
Read Moreహైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది..? బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ […]
Read Moreసర్పంచ్‌కి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట వృద్ధుడి నిరసన తన ఇంటికి వెళ్లే రహదారిని జేసీబితో మూసి వేసి తాను ఇంటికి, బయటికి వెళ్లే మార్గం లేకుండా చేసి స్థానిక సర్పంచి దౌర్జన్యం చేస్తున్నాడని నిరసిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే 75 ఏళ్ల వృద్దుడు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు. గతంలో గ్రామంలో తన ఇంటికి వెళ్లేందుకు 12 అడుల వెడల్పుతో ఒక రహదారి […]
Read Moreఅజయ్ నియంత వైఖరి మార్చుకో .!– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…? – గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు – భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా […]
Read Moreతిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇందుకోసం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. వేడుకల్లో భాగంగా జనంలోకి వెళ్లాలని చేసిన అభివృద్ధిని వారికి వివరించాలని సూచించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మిల్లర్లు, కొనుగోలు సిబ్బంది తాలు పేరుతో తరుగు తీస్తుండగంతో అక్కడక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు డబుల్ ఇండ్ల కోసం […]
Read Moreవారికి ప్రగతి భవన్ కు నో ఎంట్రీ .. టెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!! తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో ఉన్నారు. టికెట్ల కోసం ఆశావాహులు పడరాని పాట్లు పడుతున్నారు.కాంగ్రెస్, బిజెపిల లో పరిస్థితి అటుంచి, అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల విషయంలో విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు టికెట్ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పార్టీ […]
Read Moreమద్యం మత్తులో కత్తితో దాడి.. ఒకరు మృతి మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటనలో గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ కొండకించంగి గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావు మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూజారి మల్లన్న అదే గ్రామానికి చెందిన చిన్నారావు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి మద్యం సేవించారు. అంతకు ముందు మల్లన్న భార్యతో చిన్నారావు ఘర్షణ పడినట్టు […]
Read Moreసివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు.. క్రిమినల్ చర్యలకు సిద్ధం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ”ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” రావడం, చివరకు వారిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెంది. అయాషా ఫాతిమా(23), అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ(26)లకు ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ రావడం వివాదాస్పదం […]
Read Moreప్రాణం తీసిన ప్రేమ.. నల్గొండ జిల్లాలో పరువు హత్య.. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుడి హత్య ప్రాణం తీసిన ప్రేమ.. నల్గొండ జిల్లాలో పరువు హత్య.. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుణ్ని కొట్టిచంపేశారు యువతి కుటుంబసభ్యులు. ప్రియురాలి ఇంటికెళ్లిన సంతోష్‌పై కర్రలతో దాడి చేసి చచ్చేలా కొట్టారు.నమ్మి ప్రియురాలి ఇంటికెళ్లి శవమై తేలాడు ప్రేమికుడు సంతోష్. నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య.. ప్రాణంగా ప్రేమించి గుండెల్లో పెట్టుకున్న ప్రియురాలి ఇంట్లోనే శవమై తేలాడు ప్రియుడు. కాదుకాదు.. […]
Read More