kadapa

వృద్ధుడిపై బస్సు కండక్టర్‌ దౌర్జన్యం

September 20, 2022

వృద్ధుడిపై బస్సు కండక్టర్‌ దౌర్జన్యం వృద్ధుడి చేతిలోని సంచి లాక్కుంటున్న కండక్టర్‌ మర్రిపాడు, వయసుపైబడింది. సరిగా నిలబడలేకున్నాడు. కూర్చోబోగా పొరపాటున చేయి తగిలి సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పగిలింది. దీంతో కండక్టర్‌ శివాలెత్తారు. వృద్ధుడని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారు. ఈఘటన మర్రిపాడు మండలంలోని పడమటినాయుడుపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. బస్సులోని ప్రయాణికుల వివరాల మేరకు.. కడప జిల్లా బద్వేల్‌ డిపో బస్సు నెల్లూరు నుంచి బద్వేల్‌కు వెళుతుంది. పడమటినాయుడుపల్లి వద్ద దిగాల్సిన వృద్ధుడు కండక్టర్‌ సీటు దగ్గరకు […]

Read More

పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోన్న సెప్టెంబర్ 1

August 28, 2022

పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోన్న సెప్టెంబర్ 1 సాధారణంగా ఒకటో తేదీ అంటే వేతనాలు, జీతాల కోసం ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ విజయవాడ పోలీసులకు మాత్రం సెప్టెంబరు 1వ తేదీ అంటే టెన్షన్‌ మొదలైంది. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో ప్రదర్శన, సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో వారిని కట్టడి చేసే యత్నాల్లో పోలీసులు తలమునకలై ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి 3న […]

Read More

కారు బోల్తా ఎదురుగా వచ్చి తొక్కేసిన మరో లారీ

August 18, 2022

కడప శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో జిల్లా మెప్మా పీడీ సతీమణి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. శుభకార్యంతో పాటు శాఖాపరంగా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసేందుకు పులివెందులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, ఆయన సతీమణి నళినీదేవి మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం పీడీని హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు […]

Read More

దళితుడి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డగింపు

July 24, 2022

నిత్య జీవితంలో దళితులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. బతికున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వివక్ష చూపుతున్నారు. తాజాగా ఏపీలో దళితుడి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అంత్యక్రియలకు ఆటంకం కల్పించారు. కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్టాదారులు శవాన్ని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం […]

Read More

ట్రాన్స్ జెండర్ పై 15మంది అత్యాచారం

July 21, 2022

పులివెందులలోని ఒక ముసలి ట్రాన్స్ జెండర్ పై 15మంది అత్యాచారం చేసిన ఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా పులివెందులలోని కదిరి రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ట్రాన్స్ జెండర్ పై 15మంది కలిసి అత్యాచారం చేసినట్లు తోటి ట్రాన్స్ జెండర్స్ మీడియాకు తెలిపారు. కొట్టి, అత్యాచారం జరిపి కంప చెట్లలో పడేసి. వెళ్లారని బాధితురాలి తరపున ట్రాన్స్ జెండర్స్ వెల్లడించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పులివెందుల […]

Read More

ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

June 28, 2022

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది. పట్టణంలోని జెండా చెట్టు కూల్చివేతకు సంబంధించి నెలకొన్న వివాదంపై చర్చలు జరిపి ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంగా ఆయన కారుపై ముస్లిం వర్గానికి చెందిన కొందరు దాడికి యత్నించారు. అయితే అప్రమత్తమైన రాచమల్లు అనుచరులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. […]

Read More

ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

June 25, 2022

ఏపీలో ఇటీవల ఇంటర్మీడియట్‌- 2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయగా.. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 61 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9,41,358 మందిలో రెగ్యులర్‌గా రాసిన విద్యార్థులు 8,69,059 మంది కాగా, వొకేషనల్‌ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. పరీక్షలు […]

Read More

సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కుచ్చుటోపీ! 50 లక్షల డబ్బు గుటకాయస్వాహా

June 16, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి సచివాలయం (AP secretariat)లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి వద్ద లక్షల డబ్బు దండుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్‌స్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో వ్యక్తి దగ్గర ఏకంగా నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈ విధంగా ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద సుమారు యాభై లక్షల […]

Read More

నేడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన

June 7, 2022

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరులోని చుట్టు-గుంట సెంటర్‌ లో ఏర్పాటు చేసిన మెగా మేళాను సందర్శించి డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించనున్నారు.యంత్ర సేవా పథకం ద్వారా లబ్దిపొందిన రైతు గ్రూపులకు సబ్సిడీని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 10.45 – 11.30 గంటల వరకు గుంటూరులో మెగా మేళాలో ప్రదర్శనలను తిలకించిన అనంతరం పల్నాడు జిల్లా పర్యటనకు […]

Read More

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

June 4, 2022

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆరేండ్ల పాపకు, పదహారేండ్ల అమ్మాయికి, అరవై ఏండ్ల బామ్మకు రక్షణ లేదు కేసీఆర్ రాజ్యంలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదని విమర్శించారు.ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? గ్యాంగ్ రేపులో టి.ఆర్.యస్ పార్టీకి చెందిన నాయకుల బంధువులు అని మిత్రపక్షం ఎమ్మెల్యేల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం ? […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?