hydrabad

నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా!

November 20, 2022

నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా! హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్‌ అలియాస్‌ నందుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో చీటింగ్‌ కేసు నమోదైంది.వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్‌ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారి ఎస్‌.సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 […]

Read More

అందరూ చూస్తుండగానే వరదకు కొట్టుకుపోయిన 14 కార్లు..

August 8, 2022

Viral దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం అమాంతం పెరిగిపోయింది. ఖర్గోన్ జిల్లాలో సుక్ది నదికి వరద ప్రవాహం పెరిగింది. అప్పటి వరకు చుక్కలేకుండా ఉన్న నదికి.. క్షణాల్లోనే ఉధృతంగా వరద ప్రవాహం వచ్చింది. ఈ ప్రవాహంలో దాదాపు 14 […]

Read More

కాంగ్రెస్ మూడు ఎదురు దెబ్బలు తినబోతోంది : మంత్రి కేటీఆర్

July 15, 2022

హైదరాబాద్ : కాంగ్రెస్ మూడు భయంకర ఎదురు దెబ్బలు తినబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్, కర్ణాటకలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందన్నారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎంత మంది మిగులుతారో చూడాలన్నారు. ప్రగతి భవన్ లో మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కుల్చుతామని బీజేపీ నేతలు విర్రవిగడం అహంకారానికి నిదర్శనమన్నారు. 9 రాష్ట్రాల్లో బీజేపీ బలవంతం చేసి, అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిందని […]

Read More

నేడు గుంటూరు, పల్నాడు జిల్లాలలో సీఎం జగన్ పర్యటన

June 7, 2022

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరులోని చుట్టు-గుంట సెంటర్‌ లో ఏర్పాటు చేసిన మెగా మేళాను సందర్శించి డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించనున్నారు.యంత్ర సేవా పథకం ద్వారా లబ్దిపొందిన రైతు గ్రూపులకు సబ్సిడీని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 10.45 – 11.30 గంటల వరకు గుంటూరులో మెగా మేళాలో ప్రదర్శనలను తిలకించిన అనంతరం పల్నాడు జిల్లా పర్యటనకు […]

Read More

హైదరాబాద్​లోని ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం

May 21, 2022

హైదరాబాద్ : హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ కలకలం సృష్టించాడు. రోగి బంధువులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుందామనుకున్నాడు. కానీ అని పథకం బెడిసి కొట్టి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోషనగర్ కు చెందిన 19 ఏండ్ల మహ్మద్‌ జహీరుద్దీన్‌ అనే యువకుడు ఈ నెల 16న వైద్యుడి వేషధారణలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-1లోని ఓ ఆస్పత్రికి వచ్చి మూడో అంతస్తులోని ఐసీయూ […]

Read More

హైదరాబాద్ శిల్పకళా వేదికలో విషాదం..డీఎస్పీ మృతి

May 19, 2022

హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలో ఉన్న శిల్పకళావేదికలో విషాద ఘటన చోటు చేసుకుంది. శిల్పకళావేదికలో ఉన్న స్టేజ్ పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పని చేస్తున్న కుమార్ అమ్మిరేశ్ మృతి చెందారు. శిల్పకళావేదికలో దివంగత సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు అమ్మిరేష్ వచ్చారు. ఈ సందర్భంగా స్టేజ్ […]

Read More

ప్రియుడితో భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆర్మీ జవాన్..

May 19, 2022

హైదరాబాద్ : సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అదే సమయానికి సదరు సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో భార్య, ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయారు. అసలు విషయంలోకి వెళితే.. మధుసూధన్ అనే వ్యక్తి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మధుసూధన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం హైదరాబాద్, రెహ్మత్‌నగర్‌లోని యాదగిరి నగర్‌లో ఓ […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?