స్టేషన్ బెయిల్‌కు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సీఐబుక్కరాయ సముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అ.ని.శా)కు చిక్కారు. విద్యా సంస్థల యజమాని నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కళాశాల యజమాని మల్లికార్జున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసేందుకు నిందితుడి నుంచి సీఐ రాము రూ.75వేల లంచం డిమాండ్ […]
Read Moreఅనిశా వలలో ఇద్దరు ఆడిట్ శాఖాధికారులు మహబూబాబాద్:స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్) పొందిన ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్ అధికారులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు పట్టుకున్నారు.అనిశా డీఎస్పీ కె.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో సీసీఎస్ విభాగంలో పనిచేసిన పోలీసు కానిస్టేబుల్ మహ్మద్ సలీంపాషా 2022 జులై 31న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అనంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఆయన డీటీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. […]
Read Moreహోంమంత్రి కాన్వాయ్ అడ్డగింపు కొవ్వూరు మండలంలో హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం కొవ్వూరు నుంచి తాళ్లపూడి మండలం గజ్జరం వెళ్తుండగా ఆరికిరేవుల ఏటిగట్టుపై కొందరు యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని, కాన్వాయ్‌ను పంపించేశారు. వాళ్లు తాగి ఉన్నారు.. ఎస్సైఈ ఘటనపై సీఐ రవికుమార్ మాట్లాడుతూ కొవ్వూరు మండలం కుమారదేవంనకు చెందిన ఎం.సూరిబాబు, సీహెచ్ కార్తిక్‌బాబు, సీహెచ్ కుమార్ ఓ […]
Read More‘లీజు కోసం లంచమడిగిన ఐఏఎస్ రూ.80 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ ఆరోపణ హైదరాబాద్: మైనింగ్ లీజులు దక్కాలంటే లక్షలు ఖర్చవుతుందంటూ దరఖాస్తుదారులను ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ డిమాండ్ చేశారని సీబీఐ వెల్లడించింది. దరఖాస్తులను పరిశీలించడానికి రూ. 80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్, మాజీ ఐఏఎస్ […]
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలుఇద్దరు వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా ఈరోజు ఏపీలోని రెండు జిల్లాల్లో లంచం తీసుకుంటున్న ఇద్దరు వీఆర్వోలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వరగాన గ్రామ […]
Read Moreపోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోన్న సెప్టెంబర్ 1 సాధారణంగా ఒకటో తేదీ అంటే వేతనాలు, జీతాల కోసం ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ విజయవాడ పోలీసులకు మాత్రం సెప్టెంబరు 1వ తేదీ అంటే టెన్షన్ మొదలైంది. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో ప్రదర్శన, సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో వారిని కట్టడి చేసే యత్నాల్లో పోలీసులు తలమునకలై ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి 3న […]
Read Moreచింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన […]
Read More