ACB

ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ లైన్ మెన్..

May 17, 2023

ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ లైన్ మెన్.. విద్యుత్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వీరకర్ణ ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామంలో హైదరాబాద్ కు చెందిన ప్రతాప్ రెండు ఎకరాల భూమిని తీసుకున్నాడు. అందులో కరెంట్ కనెక్షన్ కోసమై జూనియర్ లైన్ మెన్ వీర […]

Read More

స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌..

December 11, 2022

స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన సీఐబుక్కరాయ సముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అ.ని.శా)కు చిక్కారు. విద్యా సంస్థల యజమాని నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ చీటింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న కళాశాల యజమాని మల్లికార్జున్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసేందుకు నిందితుడి నుంచి సీఐ రాము రూ.75వేల లంచం డిమాండ్‌ […]

Read More

అనిశా వలలో విద్యుత్తు ఏఈ,బిల్‌ కలెక్టర్

December 8, 2022

అనిశా వలలో విద్యుత్తు ఏఈ,బిల్‌ కలెక్టర్‌ యాఖుత్‌పుర సెక్షన్‌లోని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ, మీటరు రీడింగ్‌ బిల్‌ కలెక్టర్‌ ఓ వినియోగదారుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… యాఖుత్‌పురకు చెందిన ఉస్మాన్‌షరీఫ్‌ తన పురాతన నివాసాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో కొత్తగా భవనాన్ని పునర్నిర్మిస్తున్నారు.ఆ ఇంటి విద్యుత్తు మీటరుపై కొంత బిల్లు బకాయి ఉంది. దాన్ని మాఫీ చేసి కొత్త మీటరు ఇవ్వడానికి యాఖుత్‌పుర సెక్షన్‌లోని […]

Read More

ఏసీబీ వలలో మరో ఇద్దరు అధికారు

November 20, 2022

అనిశా వలలో ఇద్దరు ఆడిట్‌ శాఖాధికారులు మహబూబాబాద్‌:స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) పొందిన ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్‌ అధికారులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు పట్టుకున్నారు.అనిశా డీఎస్పీ కె.సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో సీసీఎస్‌ విభాగంలో పనిచేసిన పోలీసు కానిస్టేబుల్‌ మహ్మద్‌ సలీంపాషా 2022 జులై 31న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అనంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఆయన డీటీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. […]

Read More

లంచంతో ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

October 10, 2022

లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. లక్కవరం సచివాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ సుజాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ […]

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు

September 29, 2022

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలుఇద్దరు వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా ఈరోజు ఏపీలోని రెండు జిల్లాల్లో లంచం తీసుకుంటున్న ఇద్దరు వీఆర్వోలను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వరగాన గ్రామ […]

Read More

ఏసీబీ వలలో మరో తాసిల్దార్…

September 26, 2022

ఏసీబీ వలలో మరో తాసిల్దార్… రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత..నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఘటన… లంచం తీసుకుంటూ మరో తహసిల్దార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడు. నారాయణపేట జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇవాళ ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దామరగిద్ద మండల తహసిల్దార్ వెంకటేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఒక […]

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

September 23, 2022

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగెం ఎమ్మార్వో లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం ఎమ్మార్వో రాజేంద్రనాథ్‌.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం ఎమ్మార్వో రాజేంద్రనాథ్‌.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ […]

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

September 3, 2022

లంచంతో పాటు ఏసీ కోసం కక్కుర్తిపడిన ఓ పోలీస్ అధికారి ఏసీబీకి (ACB) చిక్కిన ఘటన భూపాలపల్లి (Bhupalapally)జిల్లాలో సంచలనం కలిగించింది. ఇద్దరు వ్యక్తుల మధ్యనున్న సమస్యను తనకు అనుకూలంగా మార్చుకున్న ఎస్ఐ (SI) ఇస్లావత్ నరేష్ (Eslavath Naresh).. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా, పోలీస్ శాఖలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలిపేలా ఉన్న ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ […]

Read More

లంచం తీసుకుంటూ.. ACBకి చిక్కిన MPDO..

August 2, 2022

వరంగల్ క్రైమ్ : అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారుల వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ ను ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేశాడు. డబ్బులు […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?