తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు

Spread the love

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. పకడ్బందీ ఏర్పాట్లు

1.⚡కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశం

కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశించింది. పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించింది. పోటీలో నిలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తాజ్‌ కృష్ణాకు రప్పించాలని ముందుగా భావించినా అనంతరం ప్రణాళిక మార్చుకున్నారు.

అయితే రాత్రి 11.30 గంటలకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులు జార్జ్ , బోసురాజు పలువురు ఏఐసీసీ కార్యదర్శులు హైదరాబాద్ చేరుకోనున్నారు.

2.⚡మా ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి- డీకే

“మా ఎమ్మెల్యేలంతా మా వెంటే ఉన్నారు. తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అభ్యర్థులతో నేరుగా సీఎమ్మే మాట్లాడారు.

మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. అభ్యర్థులంతా తాజ్‌కృష్ణకు రావాలని అధిష్ఠానం ఆదేశించింది. గెలిచిన వారిని ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలిస్తాం” అని డీకే శివకుమార్ తెలిపారు.

3.⚡తెలంగాణకు ఏఐసీసీ పెద్దలు

ఆదివారం…జడ్జిమెంట్‌ డే. దీంతో తెలంగాణకు ఏఐసీసీ పెద్దలు కూడా తరలి వస్తున్నారు. చిదంబరం, షిండే, సూర్జేవాలా తదితరులు హైదరాబాద్‌ వచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాళ్ల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలాకు..టీకాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతలు అప్పగించింది పార్టీ హై కమాండ్‌.

4.⚡హైదరాబాద్‌కు డీకే శివకుమార్

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో క్యాంప్‌ రాజకీయాలకు తెర లేచింది. ఎగ్జిట్‌ పోల్స్‌లో ముందున్న..కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌…గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా చూసేందుకు పావులు కదుపుతోంది.

ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపింది. ఆయనతో పాటు ఆరుగురు కర్నాటక మంత్రులు కూడా వచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులంతా తాజ్‌ కృష్ణా హోటల్‌కు రావాలని అధిష్టానం ఆదేశించింది.

గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆదివారం సాయంత్రం స్పెషల్‌ ఫైట్‌లో బెంగళూరుకు తరలించనున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థులందరిని హైదరాబాద్‌కి పిలిపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన తర్వాత, పార్టీ అధరైజ్‌ చేసిన ఏజెంట్‌కు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ ఈసీకి కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు

5.⚡గెలుపుపై బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల ధీమా

మరికొన్ని గంటల్లో కౌంటింగ్‌.. కానీ ఈలోగా నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు కాన్ఫిడెంట్‌గా చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈసారి మాత్రం మార్పు ఖాయంటున్నారు.

మరికొన్ని గంటల్లో తెలగాణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే.. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈ 49 కౌంటింగ్‌ సెంటర్స్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగనుంది.

అయితే.. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఉండనున్నాయి. ముఖ్యంగా.. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, పటాన్‌చెరు..

ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో 20 టేబుళ్లను సిద్ధం చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక.. చిన్న నియోజకవర్గంలో ఉదయం పది గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది

ఇప్పటికే.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది. స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు.

స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు.

దాంతో.. తెలంగాణ వ్యాప్తంగానూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

185 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?