
టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 10వ తేదీ వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుంకు అదనం. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 20 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు…