
మా ఊరా మజాకా!
నన్ను చూడు,నా అందం చూడు, నా రోడ్ల ను చూడు
అబ్బో నా పేరు హుజూర్ ..నేను గొప్ప…మా ఊరేమో దిబ్బ
ప్రగతి మొత్తం పేపర్ ప్రకటన ల పై నే,అభివృద్ధి ఆమడ దూరం
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
ట్రాఫిక్ పెరిగిన….ఆంక్షలు ఉండవు,పట్టించుకునే వారే లేరు
అంతా మా ఇష్టం
నిత్యం రోడ్డు పై ప్రయాణం చేయాలంటే నరక యాతన
సూర్యాపేట జిల్లా
హుజూర్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్ లో మూడు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదు.
నెలల తరబడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మెయిన్ రోడ్డు నుండి సాయిబాబా టాకీస్ కు వెళ్లే రహదారి ప్రారంభంలో రోడ్డు పూర్తిగా కట్టయ్యింది.
ఈ రహదారిలో వాహనాల రాకపోకలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు ఎక్కే సమయంలో వాహనాలు గుద్దుకొని ద్విచక్ర వాహనదారులు కింద పడుతున్నారు.
బస్సులు లారీలు మాత్రం ఈ రోడ్డు ఎక్కటానికి చాలా సమయం పడుతుంది.
ఎర్రవరం దేవాలయానికి వెళ్లడానికి ఇదే రహదారి కావడం వల్ల వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి.
మెయిన్ రోడ్ నుండి ఈ రోడ్డుకు తిరిగే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్కూల్ బస్సులు మూలమలుపులో నానా ఇబ్బందులకు గురవుతున్నాయి. అలాగే మెయిన్ రోడ్ నుండి లింగగిరి రోడ్డు మూలమలుపులో పెద్దగుంట ఏర్పడింది.
ఇక్కడ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. వాహనాలు ఇక్కడ దిగబడి దెబ్బతింటున్నాయి.
ఈ గుంటలో కనీసం మట్టి పోయడానికి కూడా మున్సిపాలిటీ ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇక్కడ కూడా వాహనాల రాకపోకలు వేల సంఖ్యలో ఉంటాయి.
అలాగే టీచర్స్ కాలనీకి ప్రారంభంలో రోడ్డు దెబ్బతిని వాహనాలు ఎక్కటానికి తీవ్ర ప్రయాసకు గురవుతున్నాయి.
రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటో లు,వాహనాలు నిలుపుదల చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు..
ఇందిరా సెంటర్,పొట్టి శ్రీరాములు సెంటర్ లో రద్దీ ఎక్కువ గా ఉంటుంది..గతం లో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ కు పోలీసుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు.
మరి ఇందిరా సెంటర్,పొట్టి శ్రీరాములు సెంటర్ లో టి స్టాళ్లు ఉండడం రోడ్డు మీదనే ద్వి చక్ర వాహనాలు నిలుపు దల చేయడం తో ట్రాఫిక్ పెరిగి పోయి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు..
తోపుడు బండ్లను ఎక్కడ పడితే అక్కడ నిలుపుదల చేస్తున్నారు…
దుకాణాల యజమానులు అయితే రోడ్డు మీదకు వచ్చి వారి వస్తువులు పెట్టడం తో రోడ్డు మరింత ఇరుకుగా మారి పోయి వచ్చి పోయే వాహనాలకు అంతరాయం కలుగుతోంది..
పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి గాంధీ పార్కు కు వెళ్ళాలంటే నరక యాతన కు గురి అవుతున్నారు..
గ్రంధాలయం సందులో బిర్యానీ పాయింట్లు ఎక్కువ గా ఉండడం తో రోడ్డు మీద నే భారీగా వాహనాలు నిలుపుదల చేయడం తో రాక పోకలు కు ఇబ్బంది కలుగుతోంది..
దీనితో వాహన దారులు ఇష్టానుసారం గా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలుపుదల చేస్తున్నారు.. ఓ పక్క రోడ్డు గుంతల మయం కావడం తో వాహన దారులు మరింత ఇబ్బందులకు గురి అవుతున్నారు..
.
మున్సిపాలిటీ వెంటనే ఈ మూడు ప్రాంతాలను పట్టించుకొ ని రోడ్ల ను బాగు చేయాలని ,అదే విధంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసుల్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.