
సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
జనగామ జిల్లా:ఆగస్టు13
జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇరుగు, పొరుగువారు గమనించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది.
నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామానికి చెందిన గురు, సునీత భార్యాభర్తలు. తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగులు మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశారు. భూమి కబ్జా చేసిన వారి పేర్లు సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు….
71 Views