మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

Spread the love

మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

హైదరాబాద్ :ఆగస్టు 13
రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ.

నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం, మినిస్టర్ కేటీఆర్, నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలో జాతీయ జెండాలోని మూడు రంగులను తారుమారు చేశారు.

త్రివర్ణములలో రౌద్రానికి ప్రతీక అయినా ఎరుపు రంగు పైన ఉండవలసింది, సస్యశ్యామలానికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగు ఎగువ బాగాన ముద్రించారు.

ఈ ఫ్లెక్సీని చూసిన వాహనదారులు, రాకపోకలు సాగించే సాధారణ జనం అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు. కాస్త విస్మయాన్ని కుడా వ్యక్తం చేస్తున్నారు…

59 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?