
తెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ :ఆగస్టు:13
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఒక వెటర్నరీ డాక్టర్‌కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరిక్రిష్ణ అని అంటున్నారని, ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి క్రీడా శాఖకు ఎవరు బదిలీ చేశారని, ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు.
ఈయన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడనేనా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతనికి 2025 దాకా డెప్యుటేషన్ ఇచ్చిండు అని ప్రశ్నించారు.
హరికృష్ణ-శ్రీనివాస్ గౌడ్ మంత్రి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి ఈ కీచకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత బిడ్డలపై, మహిళల మీద సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం గౌరవమున్నా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అర్జెంటుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘
మీ పిల్లలకొక న్యాయం, మా పేద పిల్లలకొక న్యాయం ఉండొద్దు. తెలంగాణను మరో మణిపూర్‌గా మార్చకండి’ అంటూ ట్వీట్ చేశారు…