
వాన బీభత్సం
కరీంనగర్ జిల్లా :
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.!
ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
వీరి కోసం కొన్ని గంటలుగా రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా.. ములుగు జిల్లాలో 8 మంది వరదల్లో కొట్టుకుపోయి తనువు చాలించారు.
హన్మకొండలో ముగ్గురు, ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ఒకరు చనిపోయారని అధికారులు వెల్లడించారు.
కాగా.. ములుగు జిల్లా మల్యాలలో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను అజ్జు, షరీఫ్, మైబూబ్ ఖాన్, సమ్మక్క, మాజీద్, కరీమ్, రశీద్, బీబీ అధికారులు గుర్తించారు.
కాగా.. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో.. గ్రామం మునిగిపోయింది. 8మంది వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు.
మిస్సయిన వారి కోసం గాలించిన సహాయక బృందాలును మృతదేహాలను గుర్తించాయి. మరోవైపు.. విద్యుత్ శాఖకు రూ. 7 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని తెలియవచ్చింది…