
అంబులెన్స్‌లో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
హైదరాబాద్:
బీఎన్‌రెడ్డి నగర్‌లో సోమవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. హై స్పీడ్‌లో అంబులెన్స్ ఒక్కసారిగా అదుపుతప్పింది.
అంబులెన్స్ రాపిడికి ఇంధన ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో క్షణాల్లోనే అంబు లెన్స్ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.
మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అంబులెన్స్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
ఒక రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ బయలుదేరింది. మార్గ మధ్యలో అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద స్థలం వద్ద వర్షం కారణంగా రోడ్డు మొత్తం చిత్తడిగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
78 Views