
గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి
హైదరాబాద్:జులై 24
గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సోమవారం తెల్ల వారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి చెందాడు.
రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్‌పై పడ్డారు.
ఈ ఘటనలో ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు (25)గా గుర్తించారు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు……..
108 Views