
ఎర్ర జెండా నీడలో గ్రామ కంఠం భూమి
సూర్యాపేట జిల్లా:జులై 18
జిల్లా లోని చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెంలో 1.25 ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. దానిని ఇటీవల కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు ఇతరులకు అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు.
కొనుగోలుదారుల నుంచి బయానా కూడా తీసుకున్నారు. విషయం తెలిసిన స్థానిక సీపీఐ నాయకులు ఈ అక్రమాన్ని మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ భూమిని గ్రామంలోని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. రెవెన్యూ వారు ఆ భూమి తమ పరిధిలోకి రాదని, గ్రామపంచాయతీలో పరిష్కరించుకోవాలని సూచించారు.
దీంతో మంగళవారం ఉదయం సీపీఐ ఆధ్వర్యంలో పలువురు పేదలు గ్రామకంఠం భూమిలో ఎర్రజెండాలు పాతి భూమిని తమకే పంచాలని నినదించారు.
ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా భూమి పూర్వపరాలు పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రెమిడాల రాజు, గ్రామ శాఖ కార్యదర్శి కంపాటి వెంకటయ్య, బేతవోలు కార్యదర్శి పొరండ్ల మట్టయ్య, రామిశెట్టి కోటయ్య, షేక్ జావెద్, మోదుగు వెంకటరెడ్డి, రణబోతు అంజిరెడ్డి, డి.పుల్లమ్మ, జనార్థన్ రెడ్డి, లక్మయ్య తదితరులు పాల్గొన్నారు…….