
ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలను, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి మొదటిసారి కళ్యాణానికి వచ్చినప్పుడు 100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని
మరల వరదల సమయంలో 2022వ సంవత్సరంలో వచ్చినప్పుడు 1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మాణాలు కరకట్ట ఎత్తు పొడిగింపులను చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చాడని,
కానీ ఇప్పటివరకు వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు గారు మోసం చేశాడని
ఈ రోజు భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య గారు.
156 Views