
కొబ్బరిబొండాల కత్తితో భార్తను హత్య చేసిన భర్త
హైదరాబాద్ :జులై 15
కంటోన్మెంట్ ఒకటవ వార్డు పరిధి నూతన్ కాలనీ లో శనివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గత రెండు సంవత్సరాలుగా అమలాపురం కు చెందిన కిరణ్, షీలా దంపతులు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో బోడుప్పల్ చిల్కానగర్లలో నివసిస్తున్న సత్యనారాయణ తన భార్య ఝాన్సీ రాణి ని తీసుకొని రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి లోని తన బావమరిది కిరణ్ ఇంటికి వచ్చాడు.
శనివారం ఉదయం 11 గంటలకు వారి మధ్య గొడవ పెరిగింది, మాట మాట పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో తన భార్య ఝాన్సీ పై దాడికి దిగి హతమార్చాడు.
ఈ దాడిలో ఝాన్సీ రాణి అక్కడికక్కడే మృతిచెందగా తన బావమరిది కిరణ్ భార్యకు స్వల్ప గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న బోయినిపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రవికుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
బేగంపేట్ ఏసీపీ పృథ్వి నాదరావు ని సందర్శించి పూర్వపరాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..