
మంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి హత్యకు గురయ్యాడు. సామాన్లు భద్రపర్చుకునే అల్మరా విషయంలో జరిగిన గొడవ కారణంగా… తన పక్క బెడ్‌పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేశాడు.
మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య (50) హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చేరారు.
మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వలస కూలీ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు.
దేవయ్య, సుధాకర్ పక్కపక్క బెడ్లపై ఉండి చికిత్స పొందుతున్నారు. సామాన్లు భద్రపరుచుకునే అల్మారా విషయంలో వారిద్దరి మధ్య మంగళవారం రాత్రి గొడవ జరిగిందని సమాచారం.
ఆ తర్వాత అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో సుధాకర్ పండ్లు కొసే కత్తితో దేవయ్య ఛాతీపై పొడిచాడు. దీనిని గమనించిన దేవయ్య భార్య కేకలు వేయగా సుధాకర్ పారిపోయాడు.
కత్తిపోటుకు గురైన దేవయ్యకు ఆస్పత్రి సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆపై, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవయ్య బుధవారం మృతి చెందారు…