
పెళ్లికి ప్రియుడు నిరాకరణ.. యువతి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా :జూలై 08
ప్రియుడు పెళ్లికినిరాకరించాడని
ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని బిబిపేట మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
యువతితో ప్రేమాయణం నడిపిన ఓ వ్యక్తి
పెళ్లి విషయానికొచ్చేసరికి మొహం చాటేశాడు.
దీంతో మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది…..
254 Views