తాడిపత్రి పట్టణ సీఐ ఆత్మహత్య

Spread the love

తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య

అనంతపురం :
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. సీఐ ఆనందరావు కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలిపారు.

నిన్న రాత్రి గొడవ జరిగిందన్నారు. ఎలాంటి పని ఒత్తిడి లేదని.. కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

అయితే ఎస్పీ ఆనందరావు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా సీఐ ఆనందరావు పెద్ద కూతురు భవ్య వర్షన్ ఉంది. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదన్నారు. తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని భవ్య వెల్లడించారు.

సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి.అని చెప్పారు…

226 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?