
దళిత జాతి గొప్ప కళాకారుడిని కోల్పోయింది.
_సాయి చందుకు ఘనంగా నివాళులు
_నీవు మా మధ్యలో లేకున్నా మా మనసులో ఎల్లప్పుడూ ఉంటావు
తెలంగాణ దండోరా తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు.
_మీసాల రాము మాదిగ
తెలంగాణ ఉద్యమకారుడు, తోటి కళాకారుడు, పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు అకాల మరణాన్ని చింతిస్తూ, తెలంగాణ దండోరా తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ ఆధ్వర్యంలో, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ సాయి చందు జోహార్ జోహార్, అమర హై సాయి చందు అమర హై, అమర హై అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మీసాల రాము మాదిగ మాట్లాడుతూ… సాయి చందు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించాలని, తన గొంతుతో, మాటతో రాష్ట్ర ప్రజలు చైతన్యం చేశారని, అలాంటి గొప్ప కవి గాయకుడు లేకపోవడం చాలా బాధాకరమని, మీసాల రాము మాదిగ అన్నారు. సాయి చందు కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ పాటలతో కన్నీటి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, దళిత ఉద్యమ నాయకులు తిరుపాల్, కుడికిల్ల రాము, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కాటేపాగా నరసింహ, కాలుతో అధ్యక్షుడు తాలూకా కార్యదర్శిలు డప్పు మధు, పర్వతాలు, యాదగిరి, సలేశ్వరం, నాగరాజు, శంకర్, స్వాతి, శ్రావణి, ఉమా, సరిత, తదితరులు పాల్గొన్నారు.