
బయ్యారం ఎస్బీఐ బ్యాంకులో లో దొంగలు పడ్డారు!
బయ్యారం:జూన్ 29
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐలో బుదవారం అర్ధరాత్రి గుర్తు తెలియిని వ్యక్తులు చోరి చేసేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది బ్యాంకు వెనుక ద్వారానికి ఉన్న డ్రిల్ ను తొలగించి తాళాన్ని పగులగొట్టి లోపలకు ప్రవేశించినట్లు సమాచారం.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకును శుభ్రం చేసేందుకు స్వీపర్ పద్మ వచ్చి చూడగా వెనుక గేటు తాళం తొలగించి ఉంది.
దీంతో ఆమె సంబదిత బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ కు ఫోన్ చేయగా ఆయన సంఘటన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. బ్యాంకు లోపలకు దొంగలు వెళ్లినట్లు తెలిసింది.
బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ చెప్పారు…
101 Views