
స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది యువతులు అరెస్ట్
హైదరాబాద్: జూన్ 27
నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అరెస్ట్ చేశారు.
స్పా నిర్వాహకురాలిని ఏపీకి చెందిన శృతిగా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం శృతి ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లారు.
ఫీజుకు డబ్బు లేకపోవడంతో నిందితురాలు వెనక్కివచ్చేశారు. ఉద్యోగాల పేరుతో యువతులతో శృతి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు…
1,027 Views