బీఎస్పీ లీడర్​పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

Spread the love

బీఎస్పీ లీడర్​పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ఖమ్మం జిల్లా దిబ్బగూడెంలో ఘటన

ఓ భూవివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఎస్పీ లీడర్ మడకం ప్రసాద్​పై దాడి చేసి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ప్రసాద్ ​పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దిబ్బగూడెం సమీపంలో సర్వే నెంబర్ 219/14లో ఐదెకరాల భూమిని బీఆర్ఎస్​కు చెందిన సర్పంచ్ నారం రాజశేఖర్ బంధువులు సాగు చేసుకుంటున్నారు.

ఆ భూమి తనదంటూ మల్లయ్యగూడానికి చెందిన సంగం దుర్గారావు, బీఎస్పీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్​చార్జి మడకం ప్రసాద్ మరికొందరు నాగళ్లతో దున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్​ రాజశేఖర్, అతడి అనుచరులు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

బీఆర్​ఎస్​ నేతల దాడిలో బీఎస్పీ నేత మడకం ప్రసాద్ గాయపడ్డారు. తర్వాత కర్రలతో ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి.

159 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?