
నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం..
ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి..
ముక్కలు ముక్కలైన శరీర భాగాలు..కారణం ఇదే!
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బర్కత్ పురా కాలనీ న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా పేలుడుకు గురైంది.
ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలయ్యారు. ప్రమాదం ధాటికి వ్యక్తుల మృతదేహాలు మాంసం ముద్దలయ్యాయి.
ఇక మరో నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతి చెందిన వారు కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పని చేసే సాజిద్ గా తెలుస్తుంది.
ప్రమాదం గురించి తెలుసుకున్న నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.
కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఇలా అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.