
ఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
తన కుమారునిపై అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ మహిళ విషం తాగి శుక్రవారం నాడు ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది.
బాధితురాలు శోబాబాయి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
పుట్టపర్తి మండలం గోనే నాయక్‌తండాకు చెందిన శోబాబాయి కుమారుడు ప్రదీప్‌నాయక్ హిందూపురానికి చెందిన వందనబాయి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇది ఇష్టం లేని వందన కుటుంబీకులు పోలీసులతో ప్రదీప్‌పై అక్రమ కేసు పెట్టించారు. హిందూపురం పోలీసులు దీనిని విచారణ చేయకుండా అక్రమ కేసు బనాయించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తన కుమారునికి న్యాయం చేయాలని కోరినా పోలీసులు స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం ఎస్పీ కార్యాలయం వద్ద శోబాబాయి క్రిమి సంహాకర మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది.
పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స నిమిత్తం సత్యసాయి జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం 108 సాయంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.