
ఫ్లెక్సీలు కడితే అమ్మకాలు ఆగుతాయా కమీషనర్ గారు?
అనుమతులు లేని అక్రమ ప్లాట్ల పై ఇవేమీ చర్యలు
అనుమతులు లేకుండా మ్యాప్ చూపించి ప్లాట్ల విక్రయాలు
అనుమతులు లేని ప్లాట్లు కొంటే మీకు ఇక పాట్లే
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా కేవలం నాలా కన్వర్షన్ తో అక్రమ వెంచర్లు పెట్టీ అమ్మకాలు జరుపుతున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్స్ గత మూడు రోజుల క్రితం ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే…
మున్సిపాలిటీ కి ఎకరానికి 10 కుంటలు భూమి ఇవ్వాల్సి ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికే 30 ఎకరాల వరకు అక్రమ వెంచర్లు పెట్టీ అమ్మకాలు జరుపుతున్నారని వాటిని అరికట్టాలని ప్రతి పక్ష కౌన్సిలర్స్ డిమాండ్ చేశారు..
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ల లో ప్లాట్లు కొనుగోలు చేస్తే తర్వాత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే మున్సిపాలిటీ కి అత్యధిక గా అనుమతుల కోసం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అని బ్యాంకులు నుండి లోన్ కూడా రాదని పదే పదే ప్రతి పక్ష కౌన్సిలర్ లు చెపుతూనే ఉన్నారు..
మున్సిపాల్టీ అధికారులు మాత్రం అనుమతులు లేని అక్రమ వెంచర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అని ప్రతి పక్ష కౌన్సిలర్స్ ఆరోపిస్తున్నారు..
అంతే కాకుండా అక్రమ వెంచర్ రియల్ వ్యాపారులు వెంచర్ మ్యాప్ లు తయారు చేసి ప్రజలను నమ్మించి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారని ,ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం కు వచ్చి అనుమతులు ఉన్నయో లేవో తెలుసుకొని ప్లాట్ల విక్రయాలు చేయాలని లేకుంటే అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావోద్దని ప్రతి పక్ష కౌన్సిలర్స్ ప్రజలను కోరుతున్నారు..
DTCP లే అవుట్ అనుమతులు లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులను కోరారు..
మున్సిపాలిటీ కమీషనర్ పట్టణం లో అనుమతులు లేని వెంచర్ల పేర్లు వాటి సర్వే నంబర్ ల తో పత్రికా ముఖంగా విడుదల చేసి ఆ ప్లాట్ల అమ్మకాలను నిలిపి వేసి అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..