
8వ అంతస్తుపై నుంచి దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సికింద్రాబాద్:జూన్ 19
నగరంలోని బన్సీలాల్‌పేటలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఘటన చోటుచేసుకుంది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసి తల్లి ఈ దారుణ ఘటన పాల్పడింది.
అనంతరం తానూ భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు.
మృతులు తల్లి సౌందర్య(26), చిన్నారులు నిత్య, నిదరష్‌గా గుర్తించారు. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు…..
191 Views