
ఆర్మూర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా:జూన్ 19
తెలంగాణలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
పట్టణంలోని ఎస్సీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని గోలి రక్షిత ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. స్థానికంగా ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుంది.
అసలేం జరిగిందీ
పట్టణంలో ఉన్న ఎస్సీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ రక్షిత స్థానిక డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది.
ఆదివారం రాత్రి స్నేహితులంతా భోజనం చేస్తుంటే.. తాను మాత్రం తినకుండా తన గదికి వెళ్లింది. ఎందుకు తినడం లేని తోటి స్నేహితులు అడగ్గా.. కాసేపటి తర్వాత తింటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
గంట తర్వాత రక్షితకు తన మిత్రులు కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఏమైందోనని వార్డెన్ ఆమె గది వద్దకు వెళ్లగా తలుపు గడియ పెట్టింది. కిటికీలో నుంచి చూడగా రక్షిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది.
వెంటనే వార్డెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉంది……….,…