
ఆహార కల్తీలు కట్టడి ఎలా?
హైదరాబాద్:జూన్ 19
నగరంలో కల్తీ దందా ఎక్కువైపోతోంది. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, మషాలాలు, నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా ఇంట్లోకి ఉపయోగించే సరుకులు, చిన్నారులు తినే వాటిపై కన్నేసిన కేటుగాళ్లు కల్తీకి తెరలేపారు.
ప్రమాదకరమైన వాటితో, ఆకర్షించే ప్యాకింగ్లతో కల్తీ సరుకును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు.
కల్తీ దందాలపై అధికారులు ఎప్పడికప్పుడు కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట కల్తీ పరిశ్రమలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా నాసిరకం వస్తులతో బిస్కట్లను తాయరు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. నగరంలోని అల్లాపూర్‌లో కల్తీ బిస్కట్ పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది.
నాసిరకమైన వస్తువులతో బిస్కట్లు తయ్యారి చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ బిస్కట్ల తయారీతో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. పరిశ్రమలోని పరిసరాలు కంపుకొడుతున్న పరిస్థితి.
ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపి వివిధ ప్లేవర్స్ బిస్కట్ తయారీకి కంత్రీగాళ్లు తెరలేపారు.
పరిశ్రమలలో ఫుడ్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కనిపించని పరిస్థితి. దీంతో భారీగా కల్తీ బిస్కట్స్‌లను ఎస్వోటీ బృందం చేసింది. కల్తీ బిస్కట్ పరిశ్రమ నడుపుతున్న షేక్ ఖదీర్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు….