
ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
సూర్యాపేట :జూన్ 18
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న.. ఎక్కడోచోట రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయివేట్ ట్రావెల్ బస్సులు వరస ప్రమాదాలకు గురై ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రయివేట్ బస్సు బోల్తా పడింది.
ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదవశాత్తు కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఫల్టీ కొట్టింది.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37మంది ప్రయాణీకులుఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హైవే రహదారికి అడ్డు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు…