
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన
ప్రేమ పేరిట నమ్మబలికిన యువకుడి మాటలకు పొంగిపోయి సర్వం అర్పించిన యువతిని ఇప్పుడు కాదంటుండడంతో ఆయన ఇంటి ఎదుట శుక్రవారం దీక్షకు దిగింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెంకు చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ పోషిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతిని ఆమె ఇంటి ఎదురుగా ఉండే శ్రీనివాసరావు నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో నమ్మించాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్న ఆయన ఇప్పుడు నిరాకరిస్తున్నాడు. కుల పెద్దలు పంచాయితీ చేసినా ససేమిరా అనడంతో యువతి తన బంధువులతో శ్రీనివాసరావు ఇంటి వద్ద దీక్షకు దిగింది.
న్యాయం జరిగే వరకు కదిలేది లేదని యువతి స్పష్టం చేయగా.. ఆమెకు సంఘీభావంగా దీక్షలో స్థానికులు పలువురు పాల్గొన్నారు. ఈ విషయమై శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు యత్నించగా నిరాకరించాడు.