
ధర్మపురిలో కత్తిపోట్ల కలకలం
జగిత్యాల జిల్లా:జూన్ 10
ధర్మపురి పట్టణంలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం కత్తిపోట్లకు గురయ్యారు.
ప్రతి శనివారం జరిగే వారం సంత వసూళ్లకు వెళ్లిన ఇద్దరు స్థానిక యువకులపై ఆంధ్ర హోటళ్లో పని చేసే యువకులు కత్తులతో దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఇద్దరు యువకులకు మెడ పక్క టెముకల భాగంలో తీవ్ర గాయాలు కాగా ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడికి పాత కక్షలు, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారం అయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, కత్తిపోట్ల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
126 Views