
కారంపూడిలో సినీ పక్కిలో చైన్ స్నాచ్చర్ హల్ చల్
డమ్మీ పిష్టల్ చూపి మహిళ మేడలో గొలుసు లాగే ప్రయత్నం
మహిళ కేకలు వేయటంతో చైన్ స్నాచ్చర్ పరార్
వెంటాడి పట్టుకున్న రాత్రి గస్తీ పోలీసులు
ఆది జననివాస ప్రాంతం గ్రామానికి నడిఒడ్డు కారంపూడిలోని సాయి కృష్ణ కాలేజీ ఏరియా కాలేజీ పక్కన ప్రధాన రహదారి వద్ద బొజ్జ. లక్ష్మి అని మహిళ బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంది
రాత్రి సమయంలో షాపు మూసేసి షాప్ కు ఎదురుగా ఉన్న గల్లీ నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె మేడలో నంటాడును గ్రహించిన చైన్ స్నాచ్చర్ ఆమెను అడ్డగించి డమ్మీ తుపాకీతో బెదిరించి మేడలో ఉన్న నంటాడు ను లాగే ప్రయత్నం చేసాడు
ఆమె కూడా చైన్ ను గట్టిగ పట్టుకొని కేకలు వేయటంతో బొజ్జ. లక్ష్మి కేకలు వినిన ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్క నివాసల ప్రజలకు ఒక్కసారిగా ఆమె కేకలు విని ఆమె వద్దకు వస్తుండగా ఇది గ్రహించిన దొంగ ఆమెను నెట్టి పారిపోయాడు.
దీనితో ఆ ప్రాంత ప్రజలు దొంగను పట్టుకునేందుకు వెంటపడటం జరిగింది. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు జరిగిన సంఘటనను తెలుసుకోవటం జరిగింది.
ప్రజలు దొంగను పట్టుకునేందుకు రెండు, మూడు బృందాలుగా ఏర్పడి గలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో విషయం తెలుసుకున్న గస్తీ పోలీసులు రంగంలోకి దిగి ఒక చోట దక్కొని ఉన్న దొంగను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మహిళ అప్రమత్తంగా వ్యవహరించటంతో ఆమె మేడలో ఉన్న నంటాడు ఆమెకు దక్కింది. దొంగను పట్టుకున్న పోలీసులను కారంపూడి మండల ప్రజలు అభినందిస్తున్నారు.