
గద్వాల్ జిల్లాలో విషాదం
గద్వాలజిల్లా :
గద్వాల్ జిల్లాలో సోమవారం విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు మునిగిపోయారు.
మృతి చెందినవారిలో అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన స్థలి వద్ద ఆర్తరోదనలు మిన్నంటుతున్నాయి.
ఆలంపూర్ నియోజవకర్గంలో కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లారు.
నదిలో దిగిన చిన్నారులకు ఈత రాకపోవడంతో నీట మునిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
1,766 Views