
ఉరేసుకుని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
ఉరేసుకుని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అక్కన్నపేట మండల పరిధిలోని గండిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గండిపల్లి గ్రామానికి చెందిన మలోతూ మోబి (52) ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ప్రస్తుతం మోబి చౌటకుంటతండాకు వలస వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. మోబీ తన ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేశాడు.
సుమారు రూ.6లక్షల అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో చౌటకుంట తండాలోని వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాండ్ర వివేక్ తెలిపారు.
592 Views