
గ్రామసభలో సర్పంచిపై దాడి
గ్రామసభలో సర్పంచిపై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్ మండలం మొట్లతండాలో బుధవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామసభ జరిగింది.
ఉపసర్పంచితో పాటు వార్డు సభ్యులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సభ వాయిదా వేయాలని సర్పంచి సుమన్ అనడంతో గ్రామానికి చెందిన యువకుడు వర్రె మహేష్ గ్రామంలో అభివృద్ధి జరగటం లేదని, పనులు చేయకుండానే నిధులు కాజేశారని ఆరోపిస్తూ సర్పంచితో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే మహేష్ అతడిపై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. గ్రామసభలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
పంచాయతీ కార్యదర్శి సభను 5వ తేదీకి వాయిదా వేయడంతో వివాదం సద్దుమణిగింది.
సర్పంచి సుమన్ మాట్లాడుతూ గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వ్యక్తిగత కక్షతో మహేష్ దాడికి పాల్పడ్డాడన్నారు.
నిధులు దుర్వినియోగం చేయలేదని అన్ని పనులకు లెక్కలు ఉన్నాయన్నారు.
మహేష్‌తో పాటు వెంకన్న, లింగన్నపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సర్పంచి తెలిపారు.