
వడదెబ్బతో విద్యార్థిని మృతి
వడదెబ్బ సోకి చికిత్స పొందుతూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు-నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు.
బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు.
ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు.
దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్ వారిని సముదాయించారు.
ఆర్‌ఎంవో శ్రీ నివాస్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు.
2,155 Views