
కారు డ్రైవర్‌కు దేహశుద్ధి
గుంటూరు జిల్లా చేబ్రోలు: మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవరుకు స్థానికులు దేహుశుద్ధి చేసిన ఘటన వడ్లమూడలో బుధవారం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో రెండు ఆటోలు, నాలుగు బైక్‌లు, రోడ్డు పక్కన వెళ్తున్నవారిని ఢీ కొట్టడంతో ఆరుగురికి గాయాలైనాయి.
నారాకోడూరు గ్రామానికి చెందిన సుమన్ తెనాలి నుంచి నారాకోడూరు వైపునకు కారులో వస్తూ సంగం జాగర్లమూడి సమీపంలో ఓ బైక్‌ను ఢీ కొట్టాడు.
ఆపకుండా అతివేగంగా నడుపుతూ వడ్లమూడి గరువుపాలెం వంతెన వద్ద ఆటో ను ఢీ కొట్టాడు.
మరి కొంతదూరం వచ్చిన తరువాత అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కను వెళ్తున్న వారిని, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు.
వడ్లమూడి గౌడపాలెం ప్రభుత్వ పాఠశాల వద్ద గోడను ఢీ కొట్టి కారు నిలిచిపోవడంతో కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. మద్యం మత్తులో కారును నడపటమే కారణంగా భావిస్తున్నారు.