
మద్యం ప్రియులకు తెలంగాణ సర్కారు బిగ్ షాక్!
మద్యం ప్రియులకు తెలంగాణ సర్కారు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
మద్యం తాగి వాహనాలు నడిపితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా మందు బాబుల తీరు మారడం లేదు.
దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాతో పాటు కనిష్టంగా జైలు శిక్ష విధించేవారు.
ఇకపై పోలీసులు తనిఖీల్లో పట్టుబడిన వారిని నేరుగా చర్లపల్లి జైలుకు పంపనున్నారు.
పట్టుబడ్డ వారితో పారిశ్రామిక వాడలో పనిచేయించాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదాల నివారణకు ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.
1,204 Views