తీగలాగితే డొంక కదిలింది

Spread the love

తీగలాగితే డొంక కదిలింది

వరంగల్‍జిల్లా :
స్కానింగ్‍ సెంటర్ల పేరుతో ఆస్పత్రులు పెడుతున్న కొంతమంది డాక్టర్లు స్కానింగ్​, అబార్షన్ల దందా నడుపుతున్నారు.

రూల్స్​ను బ్రేక్​ చేస్తూ లింగనిర్ధారణ చేస్తున్నారు. స్కానింగ్​ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తేలితే అబార్షన్​ చేసేందుకు రూ. 50 వేల దాకా దండుకుంటున్నారు.

గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో పలు స్కానింగ్‍ సెంటర్ల డాక్టర్లు, వారికి సహకరించే ఆర్‍ఎంపీలు దీనిని ప్రొఫెషనల్‍గా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

రెండేళ్ల క్రితమే ఇలాంటి వరుస ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు అధికారులు హడావుడి చేసి పలు స్కానింగ్‍ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

అయితే మళ్లీ ఆ దందా బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. లింగనిర్ధారణ చేసుకునేవారిలో తమకు పుట్టే సంతానం మగ పిల్లాడు కావాలనుకునే పేద, మిడిల్‍ క్లాస్‍ పేరేంట్స్‍ ఎక్కువగా ఉంటున్నారు.

అప్పటికే ఒకరిద్దరు ఆడపిల్లలు ఉండి అబ్బాయి కోసం చూసే వారిని గ్రామ, మండల స్థాయిలో ఆర్‍ఎంపీలు తమ కస్టమర్లుగా భావిస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఆడోమగో తెలుసుకునేందుకు స్కానింగ్‍ సెంటర్లకు పంపిస్తున్నారు.

అబ్బాయి అయితే కూల్‍గా విషయం క్లోజ్‍ అవుతుంది. ఆడపిల్లలు వద్దనుకునే వారికి తక్కువ ఖర్చులో అబార్షన్‍ చేస్తామంటూ ఆఫర్‍ ఇస్తూ ఆపరేషన్లు చేస్తున్నారు.

వెంకన్నస్వామి, లక్ష్మీదేవి ఫోటోలతో..

కడుపులో ఉండే బిడ్డ ఆడో, మగో తల్లిదండ్రులకు చెప్పుందుకు నిర్వాహకులు కోడ్​ లాంగ్వేజీ వాడుతున్నారు.

దీనికి కోసం దేవుళ్ల ఫొటోలు ఉపయోగిస్తున్నారు. తమవద్దకు వచ్చే తల్లిదండ్రులకు లింగ నిర్థారణ పరీక్షలు చేసే క్రమంలో సెంటర్‍ లోపలకు ఎవ్వరినీ మొబైల్‍ తీసుకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

నోటిమాటతో కాకుండా కడుపులో ఉన్నది చెప్పడానికి అబ్బాయైతే రాముడు, వెంకన్న స్వామి ఫోటోలు.. ఆడపిల్ల అయితే లక్ష్మిదేవి, సరస్వతి ఫోటోలను చూపుతున్నారు.

కొంత దగ్గరివారైతే ‘మీ పాప చాలా యాక్టివ్‍గా ఉందమ్మా’ అని.. బాబు అయితే ‘మీ అబ్బాయి చాలా యాక్టివ్‍గా ఉన్నాడని’ సమాచారాన్ని చేరవేస్తున్నారు.

పోలీసుల అదుపులో.. నిర్వాహకులు.!
వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో జరిగే అక్రమ దందాలు తన దృష్టికి తీసుకువచ్చేలా సీపీ రంగనాథ్‍ జనాలకు తన కాంటాక్ట్​ నంబర్‍ ఇచ్చారు.

ఈ క్రమంలో భూకబ్జాలు, పేకాటలు, డ్రగ్స్‍ దందాల సమాచారం రెగ్యూలర్‍గా వస్తున్నాయి. ఇదే తరహాలో వారం కిందట ములుగురోడ్డు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఓ ప్రైవేట్‍ హస్పిటల్‍ నిర్వాహకులు అక్రమ స్కానింగులు, అబార్షన్లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది.

సీపీ రంగనాథ్‍ తన సిబ్బందితో రంగంలోకి దిగి నిర్వాహకులను రెడ్‍ హ్యండెడ్‍గా పట్టుకున్నారనే డిస్కషన్‍ నడిచింది. శనివారం సాయంత్రం పోలీస్‍ ల ప్రెస్‍మీట్‍ ఉన్నట్లు చెప్పడంతో నిందితుల అరెస్ట్​ చూపుతారని అందరూ భావించారు.

చివర్లో ప్రెస్‍మీట్‍ క్యాన్సల్‍ అయింది. కాగా, దందాలో కొందరు పెద్ద డాక్టర్ల హస్తం ఉందని, విషయం అధికార పార్టీ పెద్ద లీడర్ల వరకు వెళ్లినట్టు సమాచారం.

సెంటర్ల అడ్రస్‍ చెబితే.. రూ. 2 వేల గిఫ్ట్​
గ్రేటర్‍ లో కొన్ని నెలల కింద ఇలాంటి వరుస ఘటనలు జరిగిన నేపథ్యంలో ‘ఒ పేపర్‍’ lo వార్తలు ప్రచురించింది. స్పందించిన అప్పటి కలెక్టర్‍ రాజీవ్‍ గాంధీ హనుమంతు, డీఎంహెచ్‍ఓ లలితాదేవి నిర్వాహకులపై కేసులు పెట్టారు.

టెస్టులు, అబార్షన్లు.. పర్మిషన్‍లేని స్కానింగ్‍ సెంటర్ల వివరాల ఇన్ఫర్మేషన్‍ ఇచ్చేవారికి రూ.2 వేలు మనీ గిఫ్ట్​ ఇస్తామని ప్రకటించారు.

దీంతో కొన్ని రోజులు ఇలాంటి దందాలు ఆగినా.. కొత్తగా వచ్చిన అధికారులు లైట్‍ తీసుకోవడంతో ఈ దందా మళ్లీ జోరందుకున్నట్లు తెలుస్తోంది…..

2,502 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?