
అజయ్ నియంత వైఖరి మార్చుకో .!
– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…?
– గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు
– భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం
– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు
– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు.
దళిత యువకుడు అని కూడా చూడకుండా నడిరోడ్డుపై వారి అనుచరులచే చితకబాదించడం ఎంత వరకు సమంజసం.ఇప్పటికైనా అజయ్ నియంత వైఖరి మార్చుకోవాలి.
తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో శీనన్న అభిమానుల తిరుగుబాటు తప్పదని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులు మంత్రి అజయ్ కి హెచ్చరికలు జారీచేశారు.
ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వూకంటి గోపాలరావు.