
పొంగులేటి అనుచరుడిపై అధికారపార్టీ నాయకుల దాడి
పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం అధికార పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే సందర్భంలో
బి అర్ ఎస్ బహిష్కృత నేత పొంగులేటి అనుచరుడు జై పొంగులేటి అనే నినాదం చేయడంతో అతన్ని పిడిగుద్దులు గుద్దారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే
ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎన్టీఆర్ సర్కిల్ కి అధికార పార్టీ కార్పొరేటర్లు చేరుకున్నారు.
ఈ తరుణంలో అక్కడ పొంగులేటి అనుచరుడు జై పొంగులేటి అనే నినాదం చేయడంతో అతనిపై అధికారపార్టీ నాయకులు పిడుగుద్దులు గుద్దరు.
ఈ నినాదం చేసింది చీకటి కార్తిక్ అనే వ్యక్తిగా గుర్తించారు. దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని చీకటి కార్తిక్ నీ స్టేషన్ కి తరలించారు.
కార్తిక్ పై దాడికి పాల్పడిన వారు మాజీ కార్పొరేటర్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోని అధికార పార్టీ కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పై పోటీకి బచ్చా నీ పెడతా అని సవాల్ విసిరారు.
దీనికి ప్రతిగా అటు మంత్రి అజయ్ కుమార్ కూడా ఘాటుగానే స్పందించరు. నువ్వు పిట్టల దొరవి, నువ్వే బచ్చా అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నారు. ఈ రోజు మరో మారు ఈ ఘటనతో వైర్యం బహిర్గతం అయ్యింది.