
తల్లిని హత్య చేసిన కూతురు
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
తల్లిని కూతురు రోకలి దుడ్డుతో మోది హత్య చేసింది. శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదివారం ఈ సంఘటన వెలుగు చూసింది.
ఉమ్మెడ గ్రామానికి చెందిన నాగం నర్సు (52) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన భర్త బోజన్న 20సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఉమ్మెడ గ్రామంలో ఒంటరిగా వుంటుంది.
ఇంట్లో ఒక రూంలో ఆమె, మరో రూంలో కూతురు నాగం హరిత ఉంటున్నారు. తల్లి కూతుళ్ల మధ్య గత కొన్ని సంవత్సరాల నుండి కుటుంబ విషయాలలో గొడవలు జరుగుతున్నాయి.
శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం మృతురాలి రెండవ కూతురు అరుణ ఇంట్లో జరిగిన ఫంక్షన్ (తొట్లె) కి వచ్చిన వారిని నర్సు తిట్టినట్లు తెలిసింది.
ఈ విషయంలో పెద్ద కూతురు హరితకు నర్సుకు మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో కూతురు , తల్లిని రోకలితో ఇష్టం వచ్చినట్లు తలపై, మొహం పైన కొట్టి పారిపోయింది.
ఈ విషయాన్ని హరిత తన చెల్లెలికి , బంధువులకు ఫోన్‌లో తెలపగా శనివారం మధ్యాహ్నం మృతురాలి రెండవ కూతురు, బందువులు వచ్చి చూడగా అప్పటికే తల్లి నర్సు చనిపోయివుంది.
దర్యాప్తులో బాగంగా, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
మృతురాలి మేనల్లుడు నవిపేట్‌కు చెందిన గణపురం రవి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రే కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు…