
ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది.
ప్రియురాలు.. ప్రియుడి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా దయాకర్ అనే యువకుడిని పూజ అనే యువతి ప్రేమిస్తోంది.
అయితే వారి ప్రేమ వివాహానికి దయాకర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించేందుకు దయాకర్ ప్రియురాలు పూజను ఇంటికి తీసుకువచ్చాడు.
తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో పూజ మనస్థాపం చెంది.. దయాకర్ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది…..
1,161 Views