
మసాజ్ ముసుగులో వ్యభిచారం… బంజారాహిల్స్ స్పా సెంటర్లో గలీజ్ దందా
మసాజ్ సెంటర్ల ముసుగులో హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచార దందా యదేచ్చగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నాయి కొన్ని ముఠాలు.
ఇలా బంజారాహిల్స్ ఫిలింనగర్ ప్రాంతంలో కొనసాగుతున్న స్పా లో వ్యభిచారం జరుగుతోంది. మసాజ్ పేరిట జరుగుతున్న ఈ గలీజ్ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాపై దాడిచేయడంతో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది.
ఫిలింనగర్ రోడ్ నెంబర్ 9 లో సిగ్నేచర్ వెల్ నెస్ స్పా నిర్వహిస్తున్నాడు శ్రీనివాస్(32).
అయితే ఈజీ మనీ కోసం స్పా నిర్వహకుడు మసాజ్ సెంటర్లో పనిచేసే అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుండి యువతులను తీసుకువచ్చి వారితో క్రాస్ మసాజ్ చేయిస్తామంటూ విటులను ఆకర్షిస్తున్నారు.
ఇలా శ్రీనివాస్ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు.
సిగ్నేచర్ వెల్ నెస్ స్పా పై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు.
దీంతో ఎస్సై కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం స్పా పై దాడిచేసి నిర్వహకుడు శ్రీనివాస్ తో పాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు అమ్మాయిలను అక్రమ రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇటీవల ఇదే ఫిలింనగర్ రోడ్ నంబర్ 9 లో అలివర్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
స్పా నిర్వహకుడు సోమా కమల్ ఈజీగా డబ్బులు సంపాదించేందుకు క్రాస్ మసాజ్ పేరిట విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహస్తున్నాడు.
ఇలా స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార కార్యకలాపాల కోసం సుమంత్ అనే యువకున్ని మేనేజర్ గా నియమించుకున్నాడు.
ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు స్పా సెంటర్ పై దాడిచేసారు.
ఇందులో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకుని నిర్వహకుడు, మేనేజర్ పై కేసులు నమోదు చేసారు.
అలాగే స్పా సెంటర్ ను సీజ్ చేసారు. స్పా సెంటర్లో పనిచేసే యువతులను రెస్క్యూ హోం కు తరలించారు.