
హైదరాబాద్‌లో ఘోరం.. కారు కింద పడి రెండున్నరేళ్ల బాలుడి మృతి
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు విండోలో తల ఇరుక్కుని 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది.
కారు కింద పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో బుధవారం నాడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ బాలుడు కారు టైరు కింద చిక్కుకున్నాడు. అయితే డ్రైవర్ ఈ విషయం గమనించకపోవడంతో టైరు కిందే నలిగిపోయాడు బాలుడు.
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.
మరోవైపు పిల్లాడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మంగళవారం కూడా ఇలాంటి ఘటన ఒక్కటి చోటు చేసుకుంది.
సూర్యపేట జిల్లాలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
బొజ్జగూడెం గ్రామంలో పెళ్లి జరుగుతుండగా పెళ్లి వేడుకల్లో జరుగుతున్న బరాత్ ను చూసేందుకు బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి కారు కిటీకిలో నుంచి తల బయటకు పెట్టింది.
అయితే డ్రైవర్ శేఖర్ దీనిని గమనించకుండా కారు విండో గ్లాస్ ను పైకి ఎత్తాడు. దీంతో అందులో చిన్నారి మెడ ఇరుకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయింది….