
మద్యానికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
మద్యానికి బానిసై బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏఎస్‌ఐ బజ్జ నాయక్ కథనం ప్రకారం..హైదరాబాద్ ఉప్పల్‌కి చెందిన రంగయ్య రెండో కుమారుడు పవన్(22) ఐఐఐటీ పూణేలో బీటెక్ ఫైనల్ ఇయర్‌ను ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్ద ఉంటూ చదువుతున్నాడు.
కాగా కొంతకాలంగా పవన్ సిగరెట్‌తో పాటు మద్యానికి బానిస అయ్యాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పవన్‌ను మందలించారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం పవన్ సిగరెట్ తాగుతుండగా సోదరుడు నవీన్ చూసి మందలించాడు.
దీంతో ఇంటి నుంచి బైక్ తీసుకొని పవన్ ఇంద్రేశంలోని ఎస్‌వీ లాడ్జిలో రూమ్ తీసుకొని అక్కడ మద్యం సేవించాడు.
అనంతరం తాను చనిపోతానని తన స్నేహితుడు ఆనంద్ ఫోన్‌కు వీడియో పంపాడు. వెంటనే ఈ విషయాన్ని పవన్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం చేరవేశాడు.
సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా రూమ్ నెంబర్105లో సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్‌తో ఉరివేసుకొని కనిపించాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తండ్రి రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.