
హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో స్పా పేరిట వ్యభిచారం!
ఈ మధ్య కాలంలో వ్యభిచారం విచ్చలి విడితనంగా మారిపోయింది. మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం యథేచ్చగా సాగుతోంది.
సమాజాన్ని చక్కదిద్దాల్సిన పోలీసులే కొన్నిసార్లు తప్పుదోవపడుతున్నారు.
అధికంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదార్లు తొక్కుతున్నారు. తాజాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ అక్రమార్జనంలో పడి తప్పదోవపట్టాడు.
ఏకంగా ఇంట్లోనే వ్యభిచారం నడిపిస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కృష్ణా జిల్లా పెనమలూరులోని ఓ మూడు మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. శనివారం జరిగిన ఈ దాడుల్లో మొత్తం 19 మంది అరెస్ట్ అయ్యారు.
అయితే, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ ఇళ్లు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కిషోర్‌దిగా తేలింది.
అతడు పోరంకిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హెడ్ కానిస్టేబుల్ కిషోర్ గుట్టు చప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా వీటిల్లో వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 మంది యువతులు.. ఏడుగురు పోలీసులు పట్టుబడ్డారు.
కిషోర్‌పై విచారణకు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలు జారీ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.